
జనరల్

భారతదేశంలో ఏఐ టూల్స్ వినియోగం వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ‘భారత్ ఎడ్‌టెక్ సర్వే–2025’ ప్రకారం దేశంలో 65 శాతం మంది ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచ సగటు 31 శాతంతో పోలిస్తే రెండింతలకు పైగా ఎక్కువ. ఏఐ మనుషులకంటే బాగా అర్థం చేసుకుంటుందని భావించే వారు పెరుగుతుండటం ఆధారపడే ధోరణిని సూచిస్తోంది. దీర్ఘకాలంలో ఇది స్వయంగా ఆలోచించే సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక చిన్నారుల్లో ఏఐ వినియోగం భారీగా పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. చిన్న వయసులోనే ఏఐపై ఎక్కువగా ఆధారపడటం వల్ల సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన తగ్గే ప్రమాదం ఉంది. అందుకే పిల్లల్లో స్వతంత్ర ఆలోచనను ప్రోత్సహిస్తూ, ఏఐ వినియోగాన్ని సమతుల్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!