
జనరల్

ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎంఆర్ ధాన్యం ఎగవేతకు సంబంధించిన వ్యవహారంలో ఖానాపూర్ పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సత్తేన్నపల్లిలోని ఏఆర్‌ఎస్ రైస్ మిల్లుకు రేఖా నాయక్ యజమానిగా ఉన్నారు. ఈ మిల్లులో సుమారు రూ.40 కోట్ల విలువైన 9 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం గోల్‌మాల్ అయినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై జిల్లా పౌరసరఫరాల అధికారులు రేఖా నాయక్‌కు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆమె నుంచి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు ఖానాపూర్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద రేఖా నాయక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!