
బిజినెస్

టెక్ దిగ్గజం యాపిల్ అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు భారత్‌లో కూడా తన మ్యాక్‌బుక్, ఐప్యాడ్ మోడళ్ల ప్రారంభ ధరలను గణనీయంగా పెంచింది. లాంచ్ ధరలతో పోలిస్తే ఈ ఉత్పత్తులపై 20 శాతం నుండి 42 శాతం వరకు పెరుగుదల నమోదైందని సమాచారం.
ఈ ధరల పెంపుకు ప్రధాన కారణం కృత్రిమ మేధస్సు విస్తరణతో మెమరీ చిప్‌ల ఖర్చులు పెరగడం. అధిక కంప్యూటింగ్ శక్తి, ఏఐ సామర్థ్యాలపై పెరుగుతున్న డిమాండ్ కారణంగా తయారీ వ్యయాలు పెరగడంతో వినియోగదారులపై ధరల భారం మోపాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!