
సినిమాలు

కృత్రిమ మేధ వల్ల కలిగే ముప్పులను ఆర్థిక రంగం తేలిగ్గా తీసుకోకూడదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ హెచ్చరించారు. ఇతర ఏఐ వ్యవస్థల్లోకి చొరబడేందుకు ఏఐ ఏజెంట్లు ప్రయత్నిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అసోచాం నిర్వహించిన ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో మాట్లాడుతూ, ఏఐ ప్రయోజనాలతో పాటు భద్రత చర్యలపై దృష్టి పెట్టాలని, మానవ పర్యవేక్షణ తప్పనిసరి అని సూచించారు.
ఏఐ ముప్పులు స్పష్టంగా కనిపించే వరకు నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని ఆయన అన్నారు. అదే సమయంలో, రుణాల అంచనా, డిఫాల్ట్ రిస్క్‌ల గుర్తింపు వంటి అంశాల్లో ఏఐ ఉపయోగకరమని వివరించారు. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాతి కాలంతో పోలిస్తే రాబోయే 20 సంవత్సరాలు మరింత సవాళ్లతో నిండివుంటాయని, వాతావరణ మార్పులు, టెక్నాలజీ, భౌగోళిక రాజకీయాలు ప్రధాన కారణాలని తెలిపారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!