

స్మార్ట్ పరికరాల తయారీ సంస్థ ఫైర్ బోల్ట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెడుతోంది. ‘బోల్ట్’ అనే కొత్త బ్రాండ్‌ను ఆగస్టు మధ్యలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సీఈఓ అర్ణవ్ కిషోర్ తెలిపారు. సుమారు 50 మిలియన్ డాలర్లు (రూ. 472 కోట్లు) పెట్టుబడితో ఉత్పత్తి అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్, పంపిణీ రంగాల్లో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ.10,000 నుంచి రూ.15,000 ధరల శ్రేణిలో 4జీ, 5జీ ఫోన్లను విడుదల చేసి, ప్రారంభ 4–5 నెలల్లోనే 5 లక్షల నుంచి 10 లక్షల యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇక స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో ఇండియా రెనో16 సిరీస్‌ను ఆవిష్కరించింది. ఇందులో రెనో16, రెనో16సీ మోడళ్లు ఉన్నాయి. హోలోవర్స్ 3డీ డిజైన్, 50 ఎంపీ టెలిఫోటో లెన్స్‌తో ఏఐ పోర్ట్రెయిట్ కెమెరా, హెచ్‌డీఆర్ వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, 6700 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ధరలు రూ.61,999 నుంచి ప్రారంభమవుతాయి. జూలై 9 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఈ-స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!