

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన ఇక్బాల్ అనే యువకుడి పరిస్థితి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒళ్లంతా తీవ్రమైన మంటగా అనిపిస్తుండటంతో పగలు, రాత్రి తేడా లేకుండా గంటల తరబడి చెరువులు, నీటి ప్రాంతాల్లో గడుపుతున్నట్లు సమాచారం. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా సరైన వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వైద్య సాయం అందించేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం.
ఇక్బాల్‌ను ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించి సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. నిపుణులైన వైద్యులు అతనికి పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, సమస్యకు అసలు కారణాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువసేపు నీటిలో ఉండటం వల్ల చర్మం దెబ్బతినడం, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రత్యేక వైద్యం అందుతున్న నేపథ్యంలో ఇక్బాల్ త్వరగా కోలుకుని సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!