
ఓటీటీ

వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త ‘గ్రీన్ డాట్’ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ ద్వారా కాంటాక్ట్స్‌లో ఎవరెవరూ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉన్నారో సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. యాక్టివ్‌గా ఉన్న యూజర్ల ప్రొఫైల్ ఫోటోపై గ్రీన్ డాట్ కనిపించనుంది.
అలాగే ఇటీవల యాప్‌ను ఓపెన్ చేసిన కాంటాక్ట్స్ పేర్లు కూడా ప్రత్యేక జాబితాలో చూపించబడతాయని తెలుస్తోంది. అయితే ‘లాస్ట్ సీన్’ వివరాలను హైడ్ చేసిన వినియోగదారుల సమాచారం ఈ ఫీచర్‌లో కనిపించదు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉండగా, త్వరలోనే అన్ని ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!