
సినిమాలు

ప్రముఖ ఈవీ తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ దేశీయ మార్కెట్లోకి కొత్త వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. మాస్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ.1.09 లక్షలుగా నిర్ణయించింది. నాలుగు బ్యాటరీ వేరియంట్లలో లభించే ఈ స్కూటర్ డెలివరీలు ఈ నెల చివరి నుంచి ప్రారంభం కానున్నాయి.
5 కిలోవాట్ల బ్యాటరీతో కూడిన వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 243 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. 2.2 కిలోవాట్ల బ్యాటరీ మోడల్ 110 కి.మీ, 2.7 కిలోవాట్ల మోడల్ 132 కి.మీ, 3.7 కిలోవాట్ల మోడల్ 171 కి.మీ వరకు రేంజ్ అందిస్తాయని తెలిపింది. ఈ స్కూటర్ బ్యాటరీ 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి సుమారు రెండు గంటలు పడుతుందని, గరిష్ఠంగా గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణించగలదని పేర్కొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!