

మహిళల క్రికెట్‌లో తొలిసారిగా నిర్వహించనున్న చాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఐసీసీ ప్రకటించిన వివరాల ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ముంబై, వడోదర వేదికలుగా ఆరు జట్లతో ఈ టోర్నీ జరగనుంది. మహిళల క్రికెట్‌లో ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ప్రత్యేకతగా నిలవనుంది.
తొలుత ఈ టోర్నీ నిర్వహణ హక్కులు శ్రీలంకకు దక్కాయి. అయితే శ్రీలంక క్రికెట్ వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న కారణాలతో ఐసీసీ ఆతిథ్య హక్కులను మార్చింది. అనంతరం బంగ్లాదేశ్, భారత్, దక్షిణాఫ్రికా బోర్డులను పరిశీలించి చివరకు భారత్‌ను ఎంపిక చేసింది. జూలై 6 నాటి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక అర్హత సాధించాయి. రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో జరిగే టోర్నీలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరతాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!