4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన

Writer: Nithish 07:12 AM, 4 సెప్టెంబర్, 2026
2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన

రోడ్డు ప్రమాదాల్లో ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ‘భారత్‌ ఎన్‌క్యాప్‌ 2’ ప్రమాణాలను 2027 అక్టోబర్‌ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. సియామ్‌ 66వ వార్షిక సదస్సులో మాట్లాడిన ఆయన.. 2023లో ప్రారంభమైన భారత్‌ ఎన్‌క్యాప్‌ ద్వారా కార్ల భద్రతను అంచనా వేయడంలో గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు. కొత్త విధానంలో రోడ్డు భద్రతకు సంబంధించిన సమగ్ర భద్రతా వ్యవస్థను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌లో ఏటా సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 1.80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, మృతుల్లో 18–36 ఏళ్ల వయసువారే అధికంగా ఉన్నారని తెలిపారు.

మరోవైపు, రాబోయే కొన్నేళ్లలో విద్యుత్‌ వాహనాలకు అందిస్తున్న ప్రభుత్వ రాయితీలు ముగిసే అవకాశం ఉందని భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి కమ్రాన్‌ రిజ్వి తెలిపారు. వాహన పరిశ్రమ ఛార్జింగ్‌ మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించడంతో పాటు పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులు పెంచాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వాహన రంగం రూ.22.75 లక్షల కోట్లకు పైగా సహకరిస్తోందని సియామ్‌ అధ్యక్షుడు శైలేష్‌ చంద్ర తెలిపారు. దేశ జీఎస్‌టీ వసూళ్లలో ఈ రంగం వాటా 15 శాతంగా ఉందని, 2025–26లో 46 లక్షల కార్లు, 2.17 కోట్ల ద్విచక్ర వాహనాలు విక్రయించినట్లు వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌

భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌

ఆర్‌బీఐ ప్లాన్‌తో పెరిగిన విదేశీ నిధులు

ఆర్‌బీఐ ప్లాన్‌తో పెరిగిన విదేశీ నిధులు

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు

భారత మార్కెట్‌లో హ్యుందాయ్‌ కీలక అడుగు

భారత మార్కెట్‌లో హ్యుందాయ్‌ కీలక అడుగు

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట

ట్యాగ్లు
భారత్‌ ఎన్‌క్యాప్‌ 2నితిన్‌ గడ్కరీరోడ్డు భద్రతకార్ల భద్రతవాహన భద్రతవిద్యుత్‌ వాహనాలుఆటోమొబైల్‌ రంగంసియామ్‌ఈవీ రాయితీలుకేంద్ర ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
న్యాయ విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

న్యాయ విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.
జనరల్

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన
బిజినెస్

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం
టెక్నాలజీ

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

ఇస్రో మరో ఘన విజయం.. కక్ష్యలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం
జనరల్

ఇస్రో మరో ఘన విజయం.. కక్ష్యలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్
జనరల్

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
జనరల్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం
జనరల్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు
జనరల్

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు
జనరల్

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు
జనరల్

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
జనరల్

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!