

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించనున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. సాధారణ వినియోగదారులపై యూపీఐ ఛార్జీల భారం ఉండదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే విధానంలో భాగంగా కొనసాగుతున్న యూపీఐ సేవలకు వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుములు వసూలు చేసే ప్రతిపాదన లేదని కేంద్రం తెలిపింది. దీంతో యూపీఐ వినియోగదారుల్లో నెలకొన్న సందేహాలకు తెరపడింది.
యూపీఐ లావాదేవీలపై వినియోగదారుల నుంచి నేరుగా ఎలాంటి రుసుములు వసూలు చేయబోరని ఇప్పటికే ఫోన్‌పే సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కూడా వెల్లడించారు. దేశంలో అత్యంత విస్తృతంగా వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపు విధానాల్లో యూపీఐ కీలకంగా మారిన నేపథ్యంలో, ఛార్జీలకు సంబంధించిన వార్తలు వినియోగదారుల్లో ఆందోళనకు కారణమయ్యాయి. అయితే కేంద్రం తాజా వివరణతో ప్రస్తుతం యూపీఐ వినియోగదారులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం ఉండదని స్పష్టమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!