

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తీరుపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు శాశ్వతంగా కనుమరుగయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. భవిష్యత్‌లో ఈ సాంకేతికత మానవాళికి తీవ్రమైన ముప్పుగా మారవచ్చని పేర్కొన్నారు. ఏఐ రంగంలోకి భారీగా పెట్టుబడులు వస్తుండటంతో టెక్నాలజీ పరిశ్రమ ఈ ముప్పులను తక్కువ చేసి చూపుతోందని ఆయన అన్నారు.
‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్ మాట్లాడుతూ గత సాంకేతిక విప్లవాలతో పోలిస్తే ఏఐ పూర్తిగా భిన్నమైనదని తెలిపారు. గతంలో కోల్పోయిన ఉద్యోగాల కంటే కొత్తగా ఏర్పడిన ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉండేదని, ఏఐ విషయంలో దీనికి భిన్నమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఏఐ వినియోగంపై ‘టోకెన్ ట్యాక్స్’ విధించాలని సూచించారు. తద్వారా ఉద్యోగులను ఏఐతో భర్తీ చేయడం కంపెనీలకు ఖరీదైనదిగా మారుతుందని, కొన్ని ఉద్యోగాలను పూర్తిగా మనుషులకే పరిమితం చేయాలని ప్రతిపాదించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!