

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అల్యూమినియం ఉత్పత్తి వ్యాపారంలోకి ప్రవేశించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలుస్తోంది. అల్యూమినియం తయారీకి కీలకమైన బాక్సైట్ ముడి పదార్థం కోసం ఒడిశాలోని కర్లాపట్ బాక్సైట్ గని వేలంలో పాల్గొనేందుకు రిలయన్స్ రూ.5 లక్షలతో టెండర్ పత్రాలను కొనుగోలు చేసింది. అయితే ఆ గనిని వేదాంత అల్యూమినియం అనుబంధ సంస్థ బాల్కో దక్కించుకుంది.
రిలయన్స్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో రెండు బొగ్గు గనులను వేలంలో దక్కించుకుంది. అక్కడ బొగ్గును సింథసిస్ గ్యాస్‌గా మార్చే కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ గ్యాస్‌ను విద్యుత్ ఉత్పత్తితో పాటు పారిశ్రామిక ఇంధనంగా ఉపయోగించవచ్చు. అల్యూమినియం సహా ఇతర లోహాల ఉత్పత్తికి ఈ గ్యాస్‌ను వినియోగించే అవకాశాలను రిలయన్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, అదానీ గ్రూప్ ఇప్పటికే అల్యూమినియం రంగంలోకి అడుగుపెట్టింది. యూఏఈ భాగస్వామ్యంతో ఒడిశాలో ఏడాదికి 20 లక్షల టన్నుల సామర్థ్యంతో అల్యూమినియం ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.1.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!