
జనరల్

రూ.10, రూ.20 విలువైన పాలిమర్ నోట్ల క్షేత్రస్థాయి ప్రయోగాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రయోగాత్మకంగా ఒక్కో విలువకు 100 కోట్ల చొప్పున నోట్లను ఆర్బీఐ జారీ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లతో పాటు ఈ పాలిమర్ నోట్లు కూడా చెల్లుబాటు కానున్నాయి.
కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటం వాటి ప్రధాన ప్రత్యేకత. అయితే వీటి తయారీ, జారీకి పట్టే సమయం, ఖర్చుపై ఇంకా స్పష్టత రాలేదు. క్షేత్రస్థాయి ప్రయోగాల ద్వారా పాలిమర్ నోట్ల మన్నిక, వినియోగ సాధ్యతను అంచనా వేయనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!