

టెలికాం రంగంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాత లైసెన్సింగ్ విధానానికి బదులుగా అనుమతి (ఆథరైజేషన్) ఆధారిత కొత్త వ్యవస్థను అమలు చేస్తూ టెలికమ్యూనికేషన్స్ చట్టం కింద కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌గా అమలు చేసేందుకు టెలికాం ఇ-సర్వీసెస్ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. టెలికమ్యూనికేషన్స్ (ప్రధాన టెలికమ్యూనికేషన్ సేవలను అందించడానికి అధికారం) నియమాలు–2025 ద్వారా టెలికాం సంస్థలు సులభంగా కొత్త విధానానికి మారే అవకాశం కల్పించింది.
ప్రస్తుతం యూనిఫైడ్ లైసెన్స్ (UL), యూఏఎస్‌ఎల్ (UASL), ఐఎస్‌పీ (ISP), ఎన్‌ఎల్‌డీ (NLD), ఐఎల్‌డీ (ILD) లైసెన్స్‌లు కలిగిన సంస్థలు ఈ కొత్త విధానంలోకి మారవచ్చు. ఈ నిబంధనల ముసాయిదాను 2025 సెప్టెంబర్ 5న విడుదల చేయగా, అభ్యంతరాలు మరియు సూచనల కోసం గడువును అక్టోబర్ 21 వరకు పొడిగించారు. వాటాదారుల అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం కేంద్రం తుది నిబంధనలు జారీ చేసింది. అర్హత కలిగిన ఏ సంస్థైనా నెట్‌వర్క్ సర్వీస్ ఆపరేటర్ (NSO), వర్చువల్ నెట్‌వర్క్ ఆపరేటర్ (VNO) లేదా రెండింటి సేవలను అందించేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!