

ఫేక్ సిమ్ కార్డులు, సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టుల వంటి నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇకపై కొత్త సిమ్ కార్డు జారీ చేసే ముందు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ (డీఐపీ)లో కస్టమర్ వివరాలను టెలికాం సంస్థలు రియల్‌టైమ్‌లో ధృవీకరించాల్సి ఉంటుంది. గుర్తింపు వివరాల్లో అనుమానాస్పద లేదా నకిలీ సమాచారం ఉన్నట్లు తేలితే సిమ్ జారీని నిలిపివేయాల్సి ఉంటుంది.
అదే సమయంలో ఒక వ్యక్తి పేరుతో ఉన్న సిమ్ కార్డుల సంఖ్యపైనా నిఘా పెట్టనున్నారు. సాధారణ ప్రాంతాల్లో ఒక్క వ్యక్తికి గరిష్ఠంగా 9 సిమ్ కార్డులకు పరిమితి ఉండగా, జమ్మూ కశ్మీర్, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి 6 సిమ్ కార్డులుగా ఉంటుంది. నకిలీ గుర్తింపు పత్రాలతో సిమ్‌లు పొందడం, వాటిని సైబర్ మోసాలకు వినియోగించడం వంటి కార్యకలాపాలను అడ్డుకోవడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!