

అమెరికాలో జూమ్ కాల్ సందర్భంగా ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించి గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత సంతతి వ్యాపారవేత్త విశాల్ గార్గ్ తాజాగా సీఈఓ పదవిని కోల్పోయారు. బెటర్ అనే ఫిన్‌టెక్ సంస్థను స్థాపించిన గార్గ్ స్థానంలో బోర్డు డైరెక్టర్ డేనియల్ లూయిస్ తాత్కాలికంగా సీఈఓ బాధ్యతలు చేపట్టారు. అయితే తనను పదవి నుంచి తొలగించేలా ఇతర డైరెక్టర్లను లూయిస్ ఒప్పించారని గార్గ్ ఆరోపించారు.
తనపై నమ్మకంతో లూయిస్‌ను బోర్డులోకి తీసుకున్నానని, కంపెనీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆయనతో కలిసి పనిచేశానని గార్గ్ తెలిపారు. అయితే బోర్డులో చేరిన కొద్దికాలానికే తనను సీఈఓ పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. ఈ పరిణామంతో తాను మోసపోయినట్లు భావిస్తున్నానని పేర్కొన్న గార్గ్, తిరిగి సీఈఓగా నియమించాలని బోర్డు సభ్యులను కోరుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!