
జనరల్

హైదరాబాద్‌కు చెందిన స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ డేటా కేంద్రాల ఇంజనీరింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన జీస్కేల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు సంస్థ ఎండీ నాగేశ్వరరావు కందుల తెలిపారు. తొలి దశలో రూ.190 కోట్ల మూలధన పెట్టుబడితో పాటు ప్రస్తుత వాటాదారులతో వ్యూహాత్మక వాటా మార్పిడి ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు చెప్పారు.
జీస్కేల్ సంస్థ కొనుగోలుకు మొత్తం రూ.500 కోట్లను వెచ్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. వాటా కొనుగోలు, సామర్థ్యాల విస్తరణ, నిర్వహణ మూలధన అవసరాల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలిపారు. అవసరమైన నిధులను పూర్తిగా అంతర్గత వనరుల ద్వారానే సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబరు నాటికి డేటా కేంద్ర వేదిక కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!