

అబుదాబిలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు సునీల్ కుమార్ సదాశివన్ (52) యూఏఈ లాటరీలో 30 మిలియన్ దిర్హామ్‌లు (సుమారు రూ.70 కోట్లు) గెలుచుకుని ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. జూలై 1న నిర్వహించిన 'లక్కీ డే' డ్రాలో ప్రకటించిన ఏడు విజేత సంఖ్యలను సరిగ్గా సరిపోల్చడంతో ఈ భారీ జాక్‌పాట్ ఆయన సొంతమైంది. ఈ విషయాన్ని యూఏఈ లాటరీ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
తన విజయంపై స్పందించిన సునీల్ కుమార్, మొదట ఫలితాలు చూసినప్పుడు సంఖ్యలను తప్పుగా చదివానేమో అనిపించిందని, మరోసారి టికెట్‌ను పరిశీలించిన తర్వాతే తాను నిజంగానే గెలిచానని తెలుసుకున్నట్లు చెప్పారు. గత ఐదు వారాల్లో యూఏఈ లాటరీ ప్రకటించిన రెండో 30 మిలియన్ దిర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్ విజేత సునీల్ కుమారే. అంతకుముందు నేపాల్‌కు చెందిన టయాబ్ ఖాన్ ఇదే జాక్‌పాట్‌ను గెలుచుకోగా, 2025లో ప్రవాస భారతీయుడు అనిల్‌కుమార్ బొల్లా 100 మిలియన్ దిర్హామ్‌ల తొలి గ్రాండ్ ప్రైజ్‌ను సొంతం చేసుకున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!