

భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) అందిస్తున్న న్యూ జీవన్ శాంతి పథకం పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి మంచి అవకాశంగా నిలుస్తోంది. ఈ ప్లాన్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టడం ద్వారా జీవితాంతం గ్యారెంటీ పెన్షన్ పొందే వీలుంది. పాలసీదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ అనే రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పాలసీదారు మరణించిన తర్వాత కూడా పెట్టుబడి మొత్తాన్ని నామినీకి తిరిగి చెల్లిస్తారు.
ఉదాహరణకు 45 ఏళ్ల వయసున్న వ్యక్తి రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి 12 సంవత్సరాల డిఫర్‌మెంట్ పీరియడ్‌ను ఎంచుకుంటే, 57 ఏళ్ల వయసు నుంచి సంవత్సరానికి సుమారు రూ.1.42 లక్షలు, అంటే నెలకు దాదాపు రూ.11,400 వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ పథకంలో 30 నుంచి 79 సంవత్సరాల మధ్య వయసున్న వారు చేరవచ్చు. కనీస పెట్టుబడి రూ.1.5 లక్షలు కాగా, గరిష్ఠ పెట్టుబడికి పరిమితి లేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!