
క్రీడలు

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 43 అడుగులకు చేరడంతో అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువ ప్రాంతాలకు సుమారు 9 లక్షల 30 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. నీటి మట్టం 48 అడుగులకు చేరితే మరింత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు.
గోదావరి పరివాహక ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎవరూ నదీ తీర ప్రాంతాలకు వెళ్లవద్దని, అధికారుల మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!