

అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్) షేర్లు మంగళవారం వాల్ స్ట్రీట్ ట్రేడింగ్లో 25.21 శాతం కుప్పకూలాయి. దీంతో కేవలం కొన్ని గంటల్లోనే కంపెనీ మార్కెట్ విలువలో దాదాపు 70 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6.7 లక్షల కోట్లకు పైగా) ఆవిరయ్యాయి. 1968 తర్వాత 58 ఏళ్లలో ఒక్కరోజులో ఐబీఎం షేర్లు ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ప్రాథమిక త్రైమాసిక ఫలితాలు మరియు కంపెనీ భవిష్యత్ వ్యాపార అంచనాలు పెట్టుబడిదారులను నిరాశపరిచాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆదాయం కేవలం 1 శాతం పెరిగి 17.2 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఐబీఎం వెల్లడించింది. సాఫ్ట్వేర్ విభాగం 5 శాతం వృద్ధి సాధించినప్పటికీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం 7 శాతం క్షీణించింది. కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ మాట్లాడుతూ, ఏఐ మౌలిక సదుపాయాలపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడంతో తమ ఉత్పత్తులపై డిమాండ్ తగ్గిందని, కస్టమర్ల వ్యయ ప్రాధాన్యతల్లో వచ్చిన వేగవంతమైన మార్పులను సకాలంలో అంచనా వేయలేకపోయామని తెలిపారు. ఏఐ తర్వాత సంస్థలు సైబర్ సెక్యూరిటీపై ఎక్కువ దృష్టి పెట్టడం కూడా వ్యాపారంపై ప్రభావం చూపిందని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!