

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,450, 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,250, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,840 మేర పెరిగాయి.
హైదరాబాద్‌లో ఉదయం 10 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,530కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,900గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా ధరలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. దీంతో పసిడి ధరలు రూ.1.50 లక్షల మార్కును దాటాయి.
ప్రధాన నగరాల్లో చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర అత్యధికంగా రూ.1,53,490గా నమోదైంది. న్యూఢిల్లీ, లక్నోలో రూ.1,51,680, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, నాగ్‌పూర్‌లలో రూ.1,51,530, వడోదరా, భోపాల్‌లలో రూ.1,51,580గా ఉంది. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ధరలు కూడా దేశవ్యాప్తంగా గణనీయంగా పెరిగాయి.
గమనిక: బంగారం కొనుగోలు చేసే ముందు ఈరోజు ధరలను తప్పనిసరిగా పరిశీలించండి. మార్కెట్ మార్పులను గమనించి సరైన సమయంలో కొనుగోలు చేయండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!