
జనరల్

దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.820 పెరిగి రూ.1,44,330కు చేరుకుంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.750 పెరిగి రూ.1,32,300కు నమోదైంది. వరుస పెరుగుదలతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక వెండి ధర కూడా అధిక స్థాయిలో కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.35 లక్షలుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మారకం విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్లు వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!