15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు రంగం సిద్ధం..

Writer: Nithish 09:37 AM, 15 సెప్టెంబర్, 2026
ఎన్‌ఎస్‌ఈ  ఐపీఓకు రంగం సిద్ధం..

దేశంలోనే అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజీ అయిన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మెగా ఐపీఓకు సిద్ధమైంది. రూ.22,562 కోట్ల విలువైన పబ్లిక్‌ ఇష్యూ సెప్టెంబర్‌ 17న ప్రారంభమై.. సెప్టెంబర్‌ 21న ముగియనుంది. ఒక్కో షేరుకు రూ.1,700–1,785 ధరల శ్రేణిని నిర్ణయించారు. అప్పర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ వద్ద రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎనిమిది షేర్లతో కూడిన ఒక్కో లాట్‌కు రూ.14,280 చెల్లించాల్సి ఉంటుంది. 2026 జూన్‌ నాటికి ఎన్‌ఎస్‌ఈకి 13.24 కోట్ల యూనిక్‌ రిజిస్టర్డ్‌ ఇన్వెస్టర్లు ఉండగా, క్యాష్‌ మార్కెట్‌లో 93.05 శాతం వాటా, ఈక్విటీ ఫ్యూచర్స్‌లో 99.72 శాతం, ఈక్విటీ ఆప్షన్లలో 68.48 శాతం వాటా ఉంది. 2025-26లో కార్యకలాపాల ద్వారా రూ.1,601.31 కోట్ల ఆదాయం పొందిన ఎన్‌ఎస్‌ఈకి లావాదేవీ ఛార్జీలే ప్రధాన ఆదాయ వనరు.

అయితే ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని రిస్కులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌ఎస్‌ఈ ఆదాయంలో 78.65 శాతం లావాదేవీ ఛార్జీల నుంచే రావడంతో ట్రేడింగ్‌ పరిమాణం తగ్గితే ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆప్షన్స్‌ ద్వారా 60.22 శాతం, ఫ్యూచర్స్‌ ద్వారా 8.92 శాతం ఆదాయం రావడం వల్ల డెరివేటివ్స్‌పై ఆధారపడటం మరో సవాలు. టాప్‌-10 ట్రేడింగ్‌ సభ్యుల నుంచే 46.78 శాతం ఆదాయం రావడం, సెబీ, ఆర్‌బీఐ, ఐఎఫ్‌ఎస్‌సీఏ నియంత్రణ, సాంకేతిక అంతరాయాలు, సైబర్‌ దాడుల ముప్పు కూడా కీలక రిస్కులుగా ఉన్నాయి. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా రూ.27,870 కోట్ల ఐపీఓ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద ఐపీఓగా ఎన్‌ఎస్‌ఈ ఇష్యూ నిలవనుంది. సెప్టెంబర్‌ 24న బీఎస్‌ఈలో ఎన్‌ఎస్‌ఈ షేర్లు లిస్ట్‌ కానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
  నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌

నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..

చమురు ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై ఒత్తిడి

చమురు ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై ఒత్తిడి

ట్యాగ్లు
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓఎన్‌ఎస్‌ఈస్టాక్‌ మార్కెట్షేర్‌ మార్కెట్ఐపీఓస్టాక్‌ ఎక్స్ఛేంజ్‌పెట్టుబడులురిటైల్‌ ఇన్వెస్టర్లుసెబీబీఎస్‌ఈ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
జీసీసీలకు ప్రధాన కేంద్రంగా మారుతున్న హైదరాబాద్‌

జీసీసీలకు ప్రధాన కేంద్రంగా మారుతున్న హైదరాబాద్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెటాతో కేంద్రం చర్చలు.. చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కీలక నిర్ణయం
జనరల్

మెటాతో కేంద్రం చర్చలు.. చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కీలక నిర్ణయం

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...
బిజినెస్

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు
జనరల్

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..
బిజినెస్

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..

యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్
బిజినెస్

యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...
క్రీడలు

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...
జనరల్

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...

22/A భూములపై మంత్రులతో సీఎం రేవంత్  కీలక భేటీ..
జనరల్

22/A భూములపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...

జాతీయ ఇంజనీర్స్ డే: ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
జనరల్

జాతీయ ఇంజనీర్స్ డే: ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు
జనరల్

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు