

అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం విఫలమైతే లేదా నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉందని భారతీయ రిజర్వు బ్యాంకు తాజా బులెటిన్‌లో హెచ్చరించింది. పశ్చిమాసియాలో తాత్కాలిక శాంతి ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అవరోధాలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
ఈ ఒప్పందం విఫలమైతే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడం, ఇంధన సరఫరాలో అంతరాయాలు, పెట్టుబడుల మందగమనం, ఆహార భద్రత సమస్యలు మరియు ఆర్థిక అస్థిరత తలెత్తే అవకాశముందని ఆర్‌బీఐ తెలిపింది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి 7.8 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నాయని ఆర్‌బీఐ పేర్కొంది. విదేశీ పెట్టుబడులు, విదేశీ మారక నిల్వలు బలంగా ఉన్నాయని తెలిపింది. మరోవైపు బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, ఆలుగడ్డ, ఉల్లిపాయ, టమాటా, వంటనూనెల ధరల పెరుగుదలతో పాటు వంటగ్యాస్ ధరల పెంపు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!