
సినిమాలు

దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులో రూ.2,290 పెరిగి రూ.1,46,510కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,100 పెరిగి రూ.1,34,300గా నమోదైంది. పసిడి ధరల ఈ భారీ పెరుగుదలతో ఆభరణాల కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెండి ధర కూడా అధిక స్థాయిలో కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,40,000గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డిమాండ్, ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!