
క్రీడలు

అమెరికా విద్యుత్ వాహన దిగ్గజ సంస్థ టెస్లా భారత్‌లో తన ‘మోడల్ వైఎల్’ కార్ల డెలివరీలను ప్రారంభించింది. ఈ 3 వరుసల సీట్లలో 6 మంది కూర్చునే లగ్జరీ ఈవీ కారు ధర రూ.61.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 681 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని, కేవలం 5 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుందని సంస్థ తెలిపింది. లగేజీ కోసం 2,539 లీటర్ల విశాలమైన స్థలం కూడా అందుబాటులో ఉంది.
కస్టమర్ల కోసం టెస్లా రూ.6.5 లక్షల డౌన్ పేమెంట్‌తో ఫైనాన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. నెలవారీ ఈఎంఐ రూ.49,990 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఈ నెల 17న హైదరాబాద్‌లో తమ 5వ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!