

ఇంటర్నెట్ అవసరం లేని వినియోగదారుల కోసం కేవలం వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ సేవలతో కూడిన తక్కువ ధర ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రతిపాదించింది. ముఖ్యంగా ఫీచర్ ఫోన్లు ఉపయోగించే వారు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు, వృద్ధులు, తక్కువ ఆదాయ వర్గాలపై పడుతున్న అదనపు డేటా ఛార్జీల భారాన్ని తగ్గించడమే దీని లక్ష్యంగా పేర్కొంది. డేటా వినియోగించని కోట్లాది మంది వినియోగదారులు ప్రస్తుతం అవసరం లేకపోయినా డేటా సేవలకు చెల్లిస్తున్నారని వినియోగదారుల సంఘాలు చెబుతున్నాయి.
అయితే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆధునిక 4జీ, 5జీ నెట్‌వర్క్‌లు పూర్తిగా డేటా ఆధారంగా పనిచేస్తాయని, వాయిస్ సేవలను డేటా నుంచి వేరు చేయడం సాంకేతికంగా క్లిష్టమని అవి పేర్కొంటున్నాయి. అదనంగా చౌక వాయిస్ ప్లాన్లు మోసగాళ్లకు అవకాశమివ్వడంతో పాటు డిజిటల్ ఇండియా లక్ష్యాలకు కూడా ఆటంకం కలిగించవచ్చని టెల్కోలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాయ్ తన ప్రతిపాదనపై ఎంతవరకు ముందుకు వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!