

రాంభావు మ్హాల్గీ ప్రబోధిని ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ‘అండర్‌స్టాండింగ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ గవర్నెన్స్ | మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల పరిపాలనా ప్రస్థానం ప్రజా విధానాలు, పారదర్శకత, జవాబుదారీతనం, దేశ నిర్మాణ విధానాల్లో తీసుకొచ్చిన మార్పులను ఆయన వివరించారు.
ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి వేగవంతమవుతుందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) వంటి వ్యవస్థలు ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచి ప్రయోజనాలను నేరుగా ప్రజలకు చేరుస్తున్నాయని వివరించారు. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యాన్ని సాధించేందుకు కీలక పరిపాలనా సంస్కరణలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ అభివృద్ధికి దోహదపడుతున్న నిర్మాణాత్మక, పరిపాలనా మార్పులను లోతుగా అధ్యయనం చేసేందుకు ఈ ఫెలోషిప్ ఒక విశిష్ట వేదికగా నిలుస్తుందని కార్యక్రమంలో పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!