
జనరల్

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మచిత్ర కళాకారుడు గట్టెం వెంకటేశ్ వినాయక చవితిని పురస్కరించుకుని వినూత్న కళాఖండాన్ని రూపొందించారు. కేవలం పెన్సిల్‌పై గణపతి స్వామివారి రూపాన్ని అద్భుతంగా చెక్కారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి 12 మిల్లీమీటర్ల ఎత్తు, 6 మిల్లీమీటర్ల వెడల్పుతో గణేశుడి ప్రతిరూపాన్ని మలిచారు.
గట్టెం వెంకటేశ్ గతంలోనూ పలు సూక్ష్మ కళారూపాలను రూపొందించి ప్రతిభ చాటారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని చికాగోలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా పెన్సిల్‌పై గణపతి రూపాన్ని చెక్కడం ద్వారా తన కళా ప్రతిభను మరోసారి చాటుకున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!