

దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మధ్య పోటీ కొనసాగుతోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెండు సంస్థలు పలు ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా రూ.349 ధరతో 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లను రెండు టెల్కోలు అందిస్తున్నాయి. ఈ ప్లాన్లలో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే రోజువారీ డేటా, ఓటీటీ, కృత్రిమ మేధ సేవల విషయంలో రెండు ప్లాన్ల మధ్య తేడాలు ఉన్నాయి. జియో ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా లభిస్తుండగా.. ఎయిర్‌టెల్ రోజుకు 1.5జీబీ డేటాను అందిస్తోంది.
అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే.. జియో రూ.349 ప్లాన్‌లో జియో హాట్‌స్టార్ మొబైల్ సభ్యత్వంతో పాటు 50జీబీ ఉచిత జియో ఏఐ క్లౌడ్ నిల్వ, 18 నెలల గూగుల్ జెమినీ ఏఐ ప్రో సేవలు ఉన్నాయి. మరోవైపు ఎయిర్‌టెల్ 12 నెలల అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సభ్యత్వంతో పాటు యాపిల్ మ్యూజిక్ ప్రయోజనాన్ని అందిస్తోంది. అయితే ఎయిర్‌టెల్ అపరిమిత 5జీ డేటాకు ప్రతి 30 రోజులకు 300జీబీ పరిమితి ఉంది. ధర, వ్యాలిడిటీ, కాలింగ్, ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ.. రోజువారీ డేటా, ఓటీటీ, కృత్రిమ మేధ సేవలు వంటి అదనపు ప్రయోజనాల పరంగా జియో రూ.349 ప్లాన్ మెరుగైన విలువను అందిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!