

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని పాలించడం కంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మోదీ బాగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానిస్తూ, ప్రధాని పదవికి రాజీనామా చేసి బాధ్యతలను మరో నాయకుడికి అప్పగించాలని అన్నారు. ఢిల్లీలో జరిగిన నిరసనల తర్వాత విద్యార్థి నిరసనకారులను పలు రాష్ట్రాల్లో వేధిస్తున్నారని కూడా ఆరోపించారు.
విద్యార్థులపై వేధింపులు కొనసాగితే ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుందని అభిజీత్ హెచ్చరించారు. జంతర్‌మంతర్ వద్ద నిరసనల సమయంలో పెల్లెట్ గన్ వినియోగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఆయనను బీజేపీ సన్మానించడం తప్పని విమర్శించారు. అలాగే బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను "పార్ట్‌టైమ్ రాజకీయ నాయకురాలు"గా అభివర్ణిస్తూ ఆమె వ్యాఖ్యలను తాను పట్టించుకోనని అన్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!