
క్రీడలు

అఫ్గానిస్థాన్ మరియు పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. అఫ్గాన్ భూభాగంలోని పౌర నివాసాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపినట్లు తాలిబన్ అధికారులు ఆరోపించారు. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.
అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఖోస్ట్, కునార్, పక్తికా ప్రావిన్స్‌లలో ఈ దాడులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది చిన్నారులు, ఒక మహిళ, ఒక వృద్ధుడు సహా మొత్తం 13 మంది మరణించగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆరోపణలపై పాకిస్థాన్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!