

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 300 ఏళ్లుగా నిలిచిపోయిన పూర్తిస్థాయి నిత్య జలాభిషేకం శనివారం పునఃప్రారంభమైంది. ఆలయంలోని రుద్రేశ్వరుడికి అభిషేకం అనంతరం నీరు బయటకు వెళ్లే సంప్రదాయ మార్గమైన సోమసూత్రం 17వ శతాబ్దంలో సంభవించిన భూకంపం తర్వాత మూసుకుపోయింది. దీంతో ఇన్నాళ్లుగా సంపూర్ణ అభిషేకాలు జరగలేదు.
ఆధునిక పరికరాలు, శాస్త్రీయ పరిరక్షణ పద్ధతులతో ఆలయ నిర్మాణానికి ఎలాంటి నష్టం కలగకుండా సోమసూత్రం పునరుద్ధరణ పనులు చేపట్టారు. 3డీ మ్యాపింగ్, ఎండోస్కోపిక్, గోప్రో కెమెరాలతో రియల్‌టైమ్ మానిటరింగ్ చేస్తూ సాఫ్ట్ డ్రిల్లింగ్ విధానంలో అడ్డంకులను పొరలవారీగా తొలగించారు. దీంతో 300 ఏళ్ల తర్వాత సోమసూత్రం తిరిగి అందుబాటులోకి వచ్చింది. దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో ఏఎ్‌సఐ హైదరాబాద్ సర్కిల్ బృందం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పనులు జరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!