
జనరల్

అభిషేక్, కాజల్ చౌదరి హీరోహీరోయిన్లుగా ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్‌పై ‘గోల్డ్ స్పాట్’ చిత్రం తెరకెక్కుతోంది. రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దుష్యంత్ కటికనేని కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. దుష్యంత్ వద్ద పనిచేసిన వేణు కార్తికేయన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది.
తాజాగా ‘గోల్డ్ స్పాట్’ అధికారిక గ్లింప్స్‌ను రేపు ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిన్న వీడియో ద్వారా సినిమా ప్రపంచం, కథా నేపథ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. గత జ్ఞాపకాలు, సున్నితమైన బంధాలను గుర్తుచేసేలా సినిమా ఉండబోతున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తుండటంతో గ్లింప్స్‌పై ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!