

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాల ప్రభావంతో ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని హోంమంత్రి అనిత సూచించారు. అత్యవసర సహాయం కోసం 112, 1070, 1800 425 0101 నంబర్లను అందుబాటులో ఉంచారు. వర్షాలు, గాలుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!