
జనరల్

ఇరాన్‌కు చెందిన చమురు నౌకలపై అమెరికా మరోసారి భారీ దాడులు చేసినట్లు అమెరికా మిలిటరీ వెల్లడించింది. ఈ దాడుల్లో మూడు నౌకలు ధ్వంసమైనట్లు తెలిపింది. తమ యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడటంతో ప్రతీకార చర్యగా ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా పేర్కొంది. అవసరమైతే ఇరాన్ చమురు నౌకాదళాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించింది.
ధ్వంసమైన నౌకలు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)కు కీలకంగా పనిచేస్తున్నాయని, షాడో నెట్‌వర్క్‌లా వ్యవహరిస్తున్నాయని అమెరికా ఆరోపించింది. ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న సమయంలో తమ యుద్ధనౌకలు ఇరాన్ దాడులను తప్పించుకున్నాయని తెలిపింది. ఈ ఘటనలో అమెరికా సిబ్బంది ఎవరూ గాయపడలేదని అమెరికా మిలిటరీ వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!