
జనరల్

రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుపై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కఠిన చర్యలు తీసుకుంది. పర్యావరణ నిబంధనలను పదేపదే ఉల్లంఘించడంతో సంస్థకు రూ.21.01 కోట్ల భారీ జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లోపాలను సరిదిద్దేందుకు పలు మార్లు సూచించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
గోదావరి నది పరిసరాల్లో వ్యర్థాలను విడుదల చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పీసీబీ ఈ చర్యలు చేపట్టింది. నిబంధనల ఉల్లంఘనలపై ఆంధ్రా పేపర్ మిల్లుపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆంధ్రా పేపర్ రాజమహేంద్రవరంలో తయారీ యూనిట్‌ను నిర్వహిస్తున్నట్లు సంస్థ అధికారిక వివరాలు కూడా పేర్కొంటున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!