

మెట్రో రైలు రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే రెండేళ్లలో అమెరికాను అధిగమించి.. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్ కలిగిన దేశంగా భారత్ అవతరించే అవకాశం ఉందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలిపారు. ప్రస్తుతం దేశంలోని 26 నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో దేశంలో కేవలం ఐదు నగరాల్లో 245 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలు మాత్రమే ఉండేవని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం 26 నగరాల్లో సుమారు 1,170 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. 12 ఏళ్లలో దేశ మెట్రో నెట్‌వర్క్ దాదాపు ఐదు రెట్లు పెరిగిందన్నారు. కొత్త ప్రాజెక్టులు పూర్తవుతూ, నిర్మాణంలో ఉన్న మార్గాలు అందుబాటులోకి వస్తే.. మరో రెండేళ్లలో అమెరికాను భారత్ అధిగమించి ప్రపంచంలో రెండో స్థానానికి చేరే అవకాశం ఉందని మనోహర్ లాల్ పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!