
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీ జల భద్రతపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న శాఖాపరమైన సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో జల రంగంలో సంయుక్తంగా పనిచేయడంపై సదస్సులో చర్చలు జరుగుతున్నాయి. నీటి మౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
సదస్సులో జల్ జీవన్ మిషన్ 2.0 కింద గ్రామీణ తాగునీటి పథకాల నిర్వహణ, తాగునీటి వనరుల సుస్థిరత, జల సంరక్షణ వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ‘జల సంచయ్ జన భాగీదారీ–క్యాచ్ ద రైన్’ కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, రాష్ట్రాల అనుభవాలు, సమస్యలు, ఉత్తమ విధానాలను పంచుకోవడంతో పాటు కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడంపై సదస్సు దృష్టి సారించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!