
షోస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు నకిరేకల్ పట్టణంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.38 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని సీఎం ప్రారంభించనున్నారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి రావడంతో నకిరేకల్ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
అలాగే రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఆధునిక ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్థానిక మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!