

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మాజీ క్రికెటర్ల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సూచించాడు. ఇందులో భాగంగా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజాలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు.
బీసీసీఐ సాంకేతిక కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రంజీ ట్రోఫీలో జోనల్ విధానాన్ని తొలగించి ఎలైట్, ప్లేట్ టోర్నీలను తీసుకొచ్చామని గావస్కర్ గుర్తుచేశాడు. పాయింట్ల విధానంలోనూ మార్పులు చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం సెలెక్షన్ కమిటీలు, క్రికెట్ సలహా కమిటీ మినహా పెద్దగా కమిటీలు లేవని పేర్కొన్నాడు. క్రికెట్ సలహా కమిటీ పరిధిని విస్తరించి, కోచ్‌లు, సెలెక్టర్ల ఎంపికతో పాటు దేశవాళీ, అంతర్జాతీయ షెడ్యూళ్లు వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునేలా చేయాలని సూచించాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!