

అయోధ్య రామమందిరానికి అందిన విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం తన ప్రాథమిక నివేదికను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు క్లీన్‌చిట్ ఇచ్చిందా లేదా బాధ్యతను నిర్ధారించిందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
విరాళాల నిర్వహణ, విలువైన వస్తువుల భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నట్లు సిట్ గుర్తించినట్టు సమాచారం. లఖ్‌నవూ డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ ఈ నివేదికను హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్‌కు అందజేశారు. విచారణ ఇంకా కొనసాగుతోందని, మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నామని సిట్ వెల్లడించింది. విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 13న ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. తుది నివేదికను 10 నుంచి 15 రోజుల్లో సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!