
టెక్నాలజీ

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవుల్లో ఒకప్పుడు తుపాకులు చేతపట్టి తిరిగిన మాజీ నక్సల్స్ ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇటీవల రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్‌లో పాల్గొని ఆకట్టుకున్నారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు పురుషులు కూడా పాల్గొన్నారు. ర్యాంప్‌పై వారు ఆత్మవిశ్వాసంతో నడుస్తూ తమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు తాజాగా వెలుగులోకి రావడంతో ఆసక్తికరంగా మారాయి. వారి ఆత్మవిశ్వాసం, రూపురేఖలు, సంప్రదాయ వస్త్రధారణపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!