
జనరల్

మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఆమె కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కమిటీ ఆదేశించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై సుష్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణ కమిటీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సురేఖను ఆదేశించింది.
మరోవైపు మాజీ మంత్రి చిన్నారెడ్డికి కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. వనపర్తిలో ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోరింది. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని చిన్నారెడ్డికి కమిటీ సూచించింది. ఈ వరుస నోటీసులు కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!