
ఆరోగ్యం

దేశంలో పశువుల పేడ, వ్యవసాయ అవశేషాలు, ఆహార వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం రూ.23,731 కోట్ల గోబర్‌ధన్ పథకానికి ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2035-36 ఆర్థిక సంవత్సరాల వరకు అమలయ్యే ఈ పథకం ద్వారా పరిశుభ్రమైన ఇంధన ఉత్పత్తితో పాటు సేంద్రియ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేసే వారికి మూలధన సాయం, రుణ సదుపాయాలు కల్పించనున్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెరగడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గడం, గ్రామీణ ఉపాధి అవకాశాలు మెరుగుపడడం, సేంద్రియ వ్యర్థాలను విలువైన ఇంధనంగా మార్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!