
బిజినెస్

ప్రభుత్వ నియామకాలు, ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకులు, అక్రమాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) చట్టం-2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ చట్టం అమల్లోకి రావడంతో పరీక్షల్లో మోసాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడింది.
ఈ చట్టం ప్రకారం నిందితులకు 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. వ్యవస్థీకృత నేరాలకు కనీసం 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి. అలాగే కేసుల దర్యాప్తును రెండు నెలల్లో, విచారణను మూడు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని చట్టంలో పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!