
జనరల్

ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజార్టీని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. డీఎంకే, శిరోమణి అకాలీదళ్, ఎన్‌సీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీల మద్దతుపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే ఎఫ్‌సీఆర్‌ఏ చట్ట సవరణ బిల్లుపై రాజీకి వచ్చే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపే అంశంపైనా చర్చ జరుగుతోంది.
మరోవైపు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథను ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆవిష్కరించనున్నారు. భారత గణతంత్ర విజయం పేరుతో ఈ పుస్తకం విడుదల కానుంది. తన జీవితం, పోరాటాల గురించి కోవింద్ ఈ ఆత్మకథలో వివరించినట్లు సమాచారం. రేపు ఉదయం 9:30 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగనుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!