

యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సిగ్మా. తమిళ స్టార్ విజయ్ తనయుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి పాటకు యూత్ నుంచి మంచి స్పందన రావడంతో, ఇప్పుడు రెండో పాటను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అయ్యయ్యో అమ్మాడి అనే ఈ పాటను ఆగస్టు 12న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు జాసన్ సంజయ్ ప్రకటించారు. సందీప్ కిషన్, ఫరియా ఫన్ మోడ్‌లో ఉన్న క్రేజీ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సిగ్మా ఓ ఆసక్తికరమైన ట్రెజర్ హంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. కమర్షియల్ అంశాలతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ఉండనున్నాయి. తొలుత జూలై 30న విడుదల చేయాలని భావించినప్పటికీ, పలు కారణాలతో సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం చివరి దశ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. జాసన్ సంజయ్ దర్శకుడిగా ఎలా మెప్పిస్తారో, సందీప్ కిషన్ ఈ ట్రెజర్ హంట్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!